Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాది వన్‌సైడ్ లవ్... ఆ అమ్మాయి జెమ్... నిందలు వేసి తప్పు చేశా.. సారీ

తాను ప్రేమించిన యువతి మరో యువతిని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టంలేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువతిపై లేనిపోని నిందలు వేసి... పెళ్లి చెడగొట్టాడు. చివరకు పెళ్లి చెడగొట్టానన్న మనస్తాపంతో ఆత్మహ

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (11:59 IST)
తాను ప్రేమించిన యువతి మరో యువతిని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టంలేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువతిపై లేనిపోని నిందలు వేసి... పెళ్లి చెడగొట్టాడు. చివరకు పెళ్లి చెడగొట్టానన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
దువ్వాడ పోలీసు స్టేషన్ పరిధిలోని అగనంపూడి నిర్వాసితకాలనీ దిబ్బపాలేనికి చెందిన దుల్ల రమేష్‌ (28) అనే యువకుడు ఐటీఐ పూర్తిచేసి పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే, ఈ యవకుడు స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. ఆమెకు 2వ తేదీన రఘు అనే అతనితో వివాహం జరగాల్సి ఉంది.
 
ఈ విషయం తెలుసుకున్న రమేష్‌ రఘు వద్దకు వెళ్లి మీరు పెళ్లి చేసుకోవాల్సిన యువతిని ప్రేమిస్తున్నానని, ఆ యువతి కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్పడంతో రఘు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు రమేష్‌పై దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం రమేష్‌పై కేసు నమోదు చేసి పూచీకత్తుపై రాత్రి ఇంటికి పంపించేశారు. 
 
ఇంటికి చేరుకున్న రమేష్‌ మనస్తాపానికి గురై దువ్వాడ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్‌ జేబులో దొరికిన సూసైడ్‌ నోట్‌లో యువతి చాలా మంచిదని, నాది వన్‌సైడ్‌ లవ్‌ అని, యువతిని దక్కించుకోడానికి నేను ఆమెపై నిందలు వేశానని, రఘు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతూ లేఖ రాశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments