Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీకలదాకా మద్యం సేవించాడు.. చివరకు దాన్ని కోసేసుకున్నాడు...

కర్ణాటకకు చెందిన ఓ తాగుబోతు పీకల వరకు మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏం పని చేస్తున్నాడో తెలియక.. తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో జరిగింది. తాజాగా వె

Advertiesment
పీకలదాకా మద్యం సేవించాడు.. చివరకు దాన్ని కోసేసుకున్నాడు...
, సోమవారం, 3 సెప్టెంబరు 2018 (08:39 IST)
కర్ణాటకకు చెందిన ఓ తాగుబోతు పీకల వరకు మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏం పని చేస్తున్నాడో తెలియక.. తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని బసవనబాగేవాడి తాలూకా ఇవనగి గ్రామానికి చెందిన రాజకుమార కుంబార(40) అనే వ్యక్తి ఆదివారం కావడంతో ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడో కూడా తెలియని మత్తులో తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన ఇతర మద్యంబాబులతో పాటు.. స్థానికులు ఆయన్ను హుటాహుటిన విజయపురలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : రాజ్‌నాథ్ సింగ్