Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిగా విశాఖ... త్వరలోనే నిర్ణయం: విజయసాయి కీలక ప్రకటన

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:16 IST)
వైసీపీ ఎంపీ, కీలకనేత విజయసాయిరెడ్డి నవ్యాంధ్ర రాజధానులపై మరోసారి కీలక ప్రకటన చేశారు. అమరావతి నుంచి రాజధాని మార్చొద్దని రైతులు, ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు.. కరోనా వైరస్ నేపథ్యంలోనూ ఇప్పటికీ రాజధాని ప్రాంత రైతులు, కూలీలు వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ కీలక నేత విజయసాయి కీలక ప్రకటన చేశారు.

‘విశాఖ రాజధానిగా వచ్చి తీరుతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అది ఎప్పుడు అన్నది త్వరలో నిర్ణయం ఉంటుంది’ అని ప్రకటించారు. మంగళవారం నాడు విశాఖలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన ఈ ప్రకటన చేశారు.

ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు ఎంపీ.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపీ సుజనా వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు. ఈ క్రమంలో రాజధాని ప్రస్తావన తెచ్చిన విజయసాయి పై విధంగా ప్రకటన చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments