Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాలు చేయొద్దు ప్లీజ్: విజయసాయిరెడ్డి

రాజకీయాలు చేయొద్దు ప్లీజ్: విజయసాయిరెడ్డి
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (08:20 IST)
కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద పారిశ్రామికవేత్తలు పేదలకు అండగా ఉండాలని, విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు.

ఇప్పటివరకు విశాఖలో సీఎం, పీఎం సహాయ నిధికి రూ. 6 కోట్ల నిధులు విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "విశాఖ జిల్లాలో 4,800మందికి స్వచ్చంధసంస్ధల ద్వారా నిత్యావసరవస్తువులు అందచేయాలని నిర్ణయించాం.

జిల్లా కలెక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు వారు షెల్టర్ లకు వచ్చే దానికి  ఇబ్బందులు ఉన్న దష్ట్యా ఈ సమీక్షా సమావేశంలో అలా నిర్ణయించాం. 
 
విశాఖపట్నం ఏపిలో ఇండస్ర్టీయల్ సిటి.ఎక్కువ పరిశ్రమలు ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. కార్పోరేట్ సంస్ధలు సోషల్ రెస్పాన్సిబులిటి కింద చాలామంది డొనేషన్లు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ కు కొందరు, ముఖ్యమంత్రికి మరికొందరు అందించారు.
 
ఇవి కాకుండా నిబంధనలను అనుసరించి ఒక సమావేశం ఏర్పాటుచేసి ఆ సమావేశంలో మనకున్న అన్ని మండలాలు, సిటిలో 98 వార్డులు వారి వారి అవసరాలకు తగిన విధంగా కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి కింద జిల్లా కలెక్టర్, సిపి, ప్రజాప్రతినిధులందరం కలసి ఆ సమావేశం ఏర్పాటుచేస్తాం.వారికి వార్డులు,మండలాల వైజ్ గా ఏ సదుపాయలు అవసరమో ఆ సదుపాయలు కల్పిస్తాం.
 
ఇండస్ర్టీస్ ఇచ్చే విరాళాలతో మెడికల్ ఎక్విప్ మెంట్ ,గ్లౌజులు,నిత్యావసరవస్తువులు,మెడిసిన్స్ వంటివాటిని అందించేవిధంగా చేద్దామనుకుంటున్నాం.ఇప్పటివరకు విశాఖలో కార్పోరేట్ సంస్ధలు అన్నీ కూడా విరాళాలు ఇఛ్చాయి.ఇప్పటివరకు  పిఎం రిలీఫ్ ఫండ్ కు 1,50,500. సిఎం రిలీఫ్ ఫండ్ కు 2,18,71,750.జిల్లా కలెక్టర్ ఫండ్ 4,31,66,023 రూపాయలు వచ్చాయి.
 
ఇవి కాకుండా కొంతమంది శానిటైజర్స్ మాస్కులు కూరగాయలు,నాన్ క్యాష్ ఐటమ్స్ కూడా ఇచ్చారు.ఇక్కడ ఉన్న ఇండస్ర్టీలన్నింటిని కూడా మరింతగా ఇన్ వాల్వ్ చేయాలని ప్రజలకు ఉపయోగపడేవిధంగా చేయాలనే ఉద్దేశ్యంతో ఒక సమావేశం ఏర్పాటుచేయబోతున్నాం.
 
వీలైనంతవరకు ఏ ఒక్కరు ఈ జిల్లాలో ఇబ్బంది పడకుండా అసౌకర్యానికి గురికాకుండా ప్రతి ఒక్కరి ప్రయోజనాలు కాపాడటం జరుగుతుంది.దురదృష్టం కొద్ది కొంతమంది వ్యక్తులు కొన్ని రాజకీయపార్టీలు విమర్శలు చేస్తున్నాయి. నిజంగా అధికారయంత్రాగం, ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తున్నారు.ఇది రాజకీయవిమర్శలు చేసే సమయం కాదు.
 
 ఏ రాజకీయపార్టీ కూడా రాజకీయం చేయకుండా వారు కూడా ప్రజలకు ఉపయోగపడేలా సేవలందించాలని కోరుకుంటున్నాను" అని ప్రతిపక్షాలకు హితవుపలికారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్య సిబ్బందికి రెట్టింపు వేత‌నం...ఎక్కడ?