మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

ఠాగూర్
శుక్రవారం, 20 జూన్ 2025 (12:55 IST)
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యంమత్తులో రెచ్చిపోయారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. పట్టణంలో నానా హంగామా చేశారు. ఓ ప్రైవేటు స్కూలు వాహనంలో కూర్చొనివున్న ఓ విద్యార్థినిపై దాడి చేశారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, భీమవరంలో శుక్రవారం కొందరు యువకులు పీకల వరకు మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చి వీరంగం సృష్టించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ కాలేజీ బస్సులోని విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారు. తమపై ఎందుకు దాడి చేస్తున్నారంటూ ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింతగా రెచ్చిపోయారు. ప్రశ్నించిన యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. 
 
బాధితుడైన విద్యార్థి ప్రయాణిస్తున్న కాలేజీ బస్సును సైతం కొంతదూరం వెంబడించారు. బస్సు వెంటపడుతూ అసభ్యకరమైన చేష్టలు చేయడంతోపాటు నడి రోడ్డుపై డ్యాన్సులు చేస్తూ అలజడి సృష్టించారు. వారి ప్రవర్తనతో రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కొందరు మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments