Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ఎఫెక్ట్: వినాయ‌క చవితి మండపాలకు అనుమతి లేదు: మంత్రి వెలంప‌ల్లి

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (08:48 IST)
క‌రోనా నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు కోవిద్ -19 నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని, ఈ ఏడాదికి ప్ర‌జ‌లు అంద‌రు వారివారి గృహ‌ల్లోనే విఘ్నేశ్వర పూజలు నిర్వ‌హించుకోవాల‌ని దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాసరావు తెలిపారు.

దేవ‌దాయశాఖ మంత్రి కార్యాల‌యంలో దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు, దేవ‌దాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ అజాద్ మ‌రియు డైరెక్ట‌ర్ ఫ‌ర్ హెల్త్ అరుణ‌కుమారి, లా అండ్ అర్డ‌ర్ అడిష‌న‌ల్ డిజి రాజ‌శేఖ‌ర్‌, డైరెక్ట‌ర్ ప్రోటోకాల్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ పొటోకాల్ రాంసుబ్బ‌య్య‌, త‌దిత‌రులతో మంత్రి వెలంప‌ల్లి  ‌స‌మావేశం నిర్వ‌హించారు. 
 
క‌రోనా నేప‌థ్యంలో ఇత‌ర రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో జ‌రుగుతున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేయ‌డం జ‌రిగింద‌న్నారు, అదే విధంగా రాష్ట్ర‌ప్ర‌భుత్వ నిభంధ‌న‌ల‌ను వివ‌రించారు.
 
రెండు అడుగులలోపు వినాయ‌కుని విగ్ర‌హాలను మాత్ర‌మే పూజలు చేయ‌డం, అదే రోజు ఎక్క‌డ విగ్ర‌హాల‌ను అక్క‌డే నిమ‌జ్జ‌నం చేయాల‌న్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం లేదా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు అనుమతింంచ‌డం లేద‌న్నారు.

అదేవిధంగా ఊరేగింపులు మరియు విగ్రహాన్ని న‌దులు, చెరువులో ముంచడం లేదన్నారు. క‌రోనా నివార‌ణకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని, అంద‌రూ వ్యక్తిగతంగా ఇంట్లోనే విఘ్నేశ్వర పూజలు నిర్వ‌హించుకోవాల‌ని మంత్రి వెలంప‌ల్లి కోరారు. 
 
ప్ర‌జ‌లు బ‌హిరంగ  ప్రదేశాలలో/ మార్కెట్ త‌దిత‌ర  ప్రదేశాలను సంద‌ర్శించిన్న‌ప్ప‌డు త‌ప్ప‌ని స‌రిగా సామాజిక దూరం, ఫేస్ మాస్క్ ధరించాలని, అదే విధంగా దుకాణ‌దారులు నిబంధ‌న‌లు పాటించాలి. 
 
ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేట్ ఆల‌యాల్లో ప్రభుత్వం జారీ చేసిన నిభంధ‌న‌ల ప్ర‌కారం ప‌రిమితి సంఖ్య‌లో 10మందితోనే సామాజిక దూరం పాటిస్తూ, ఫేస్ మాస్క్ ధ‌రించి పూజలు నిర్వ‌హించుకోవాల‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments