సైకో పోవాలి.. సైకిల్ రావాలి... వైకాపా ఎమ్మెల్యేకు ఎంఎస్ బాబుకు షాక్

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (15:55 IST)
చిత్తూరు జిల్లా పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గ్రామస్థులు షాకిచ్చారు. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల తోరణాలు, టీడీపీ జెండాలు, గోడల నిండా 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పోస్టర్లు కనిపించాయి. ఆదేసమయంలో సైకో పోవాలి.. సైకిల్ రావాలి అనే పాట మైకులో హోరెత్తుతోంది. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. 
 
గురువారం బంగారుపాళ్యం మండలం మొగిలివా రిపల్లెలో ఈ పరిస్థితి ఎదురైంది. వైసీపీ నాయకులు జోక్యం చేసుకుని ఆ పాటను ఆపాలని గ్రామస్థులకు సూచించారు. వారు అంగీకరించలేదు. పైగా 'మా గ్రామానికి ఏం చేశారు? ఇప్పుడెందుకొచ్చారు? ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకున్నారా?' అంటూ కారులోంచి దిగని ఎమ్మెల్యేను గట్టిగా ప్రశ్నించారు. 
 
ఆ వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పాటను నిలిపి వేయించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో 90 ఇళ్లు ఉండగా, రెండు ఇళ్లకు వద్దకు మాత్రమే ఎమ్మెల్యే వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వెనుదిరిగారు. మొగిలివారిపల్లెలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఎదురైన నిరసన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments