అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

ఐవీఆర్
శుక్రవారం, 25 జులై 2025 (21:21 IST)
ప్రియురాలిని కలుసుకునేందుకు ఆ యువకుడు అర్థరాత్రి వేళ తచ్చాడుతూ వెళ్తున్నాడు. తనను ఎవరో గమనిస్తున్నారని తెలుసుకుని ఆ యువకుడు చెట్ల చాటున నక్కాడు. అంతే... గ్రామస్తులంతా ఒక్క ఉదుటన అతడిపై బడి చితక్కొట్టారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో అర్థరాత్రి వేళ సురేష్ అనే యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చాడు. ఐతే అతడు తన ప్రియురాలిని కలిసేలోపుగా అతడు కొంతమంది గ్రామస్తుల కంటబడ్డాడు. దాంతో ఊరు ఊరంతా కదిలివచ్చింది. అతడు దొంగ అనుకుని వెంటబడ్డారు. ఆ యువకుడు భయంతో ముళ్లపొదల్లో దాక్కున్నాడు.
 
గ్రామస్తులంతా ముళ్లపొదల్లో నక్కిన యువకుడిని బైటకు లాగి సమీపంలో వున్న కరెంట్ స్తంభానికి కట్టేసి అర్థరాత్రి వేళ ఎందుకొచ్చావని ప్రశ్నించారు. తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చానని చెబితే పరిస్థితి మరింత దిగజారుతుందని అతడు నోరు మెదపలేదు. దాంతో అంతా కలిసి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చానంటూ ఆ యువకుడు పోలీసుల వద్ద బావురుమంటూ ఏడ్చాడు. పోలీసులు అతడికి పలు ప్రశ్నలు వేసి... అతడు నిజంగానే ప్రియురాలి కోసం వచ్చాడని నిర్థారించి, ఆసుపత్రికి పంపించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments