Rashmika- the girl firend
రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రశ్మిక, దీక్షిత్ శెట్టిపై పాట చిత్రీకరిస్తున్నారు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ చిత్రంలోని పాటను ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
నటీనటులు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు