Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం ఖాళీ చేస్తామని అద్దెకు దిగారు.. తీరాచూస్తే...

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (10:48 IST)
విజయవాడ నగరంలో విషాదం జరిగింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ ఓ ప్రేమ జంట గదిని అద్దెకు తీసుకున్నారు. తీరా సాయంత్రం లాడ్జి సిబ్బంది వెళ్ళి చూస్తే ఆ ప్రేమ జంట పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడివున్నారు. 
 
ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని ఓ లాడ్జికి రెండు రోజుల క్రితం ఓ ప్రేమజంట వచ్చింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. అయితే, ఏంజరిగిందో ఏమో తెలియదుగానీ, తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును వారిద్దరూ సేవించారు. 
 
అయితే, సాయంత్రం గదిని ఖాళీ చేస్తామన్న ప్రేమ జంట ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది తలుపులు తట్టగా వారు తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఆ ప్రేమజంట పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. వీరిలో ప్రియురాలు చనిపోయింది. 
 
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మృతురాలు విజయవాడ సమీపంలో ని ఓ ప్రైవేటు కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఈ ఆత్మహ్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments