Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రికి సీఎం జ‌గ‌న్... ఏర్పాట్లు ప‌రిశీలించిన జేసీ మాధ‌విల‌త‌

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (12:52 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను, భక్తులకు కల్పించిన సౌకర్యాలను విజ‌య‌వాడ‌ జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా.కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)కె.మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ప‌రిశీలించారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత ఆదేశించారు. 
 
 
మెట్ల మార్గం నుంచి అంతరాలయం వరకు వున్న ఐదు క్యూలైన్లను నిశితంగా పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేని రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమారు రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో, క్యూ లైన్లు, ఓంకారం ప్రాంతాల్లో పర్యటించి భక్తులతో మాట్లాడి వారి ఫీడ్ బ్యాక్ ను కూడా తెలుసుకున్నారు. అనంతరం మంగళవారం ఇంద్రకీలాద్రికి రానున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రోటోకాల్ విధులు నిర్వహిస్తున్నస్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నారాయణరెడ్డి, తహసీల్దార్ బి.భద్రులను విఐపిల రాకపోకలపై జేసీ ఆరా తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments