Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరే అమ్మాయితో నా భర్తకు అక్రమ సంబంధం నాకు తెలుసు... కానీ చాలా మంచోడు...

ఇదేదో టీవీ సీరియల్లో వచ్చే మాటలు అనుకునేరు. నిజంగానే... ఓ భార్య తన భర్త వేరే అమ్మాయితో నెరపుతున్న అక్రమ సంబంధాన్ని సమర్థించడమే కాకుండా తన భర్త చాలా మంచివాడని పొగడ్తలు కూడా కురిపించేశారు. ఇంతకీ విషయం ఏంటంటే... విజయవాడలో డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ క

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (13:52 IST)
ఇదేదో టీవీ సీరియల్లో వచ్చే మాటలు అనుకునేరు. నిజంగానే... ఓ భార్య తన భర్త వేరే అమ్మాయితో నెరపుతున్న అక్రమ సంబంధాన్ని సమర్థించడమే కాకుండా తన భర్త చాలా మంచివాడని పొగడ్తలు కూడా కురిపించేశారు. ఇంతకీ విషయం ఏంటంటే... విజయవాడలో డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ కేసు నమోదైంది. ఐతే ఆమె ఏమైందనే దిశగా పోలీసులు కూపీ లాగుతూ పోగా అది కాస్తా మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కొడుకు విద్యాసాగర్ వద్దకు వచ్చి ఆగింది. దాంతో అతడిని అరెస్ట్ చేశారు.
 
దీనిపై విద్యాసాగర్ భార్య ఇలా చెప్పుకొచ్చారు. గత రెండు రోజుల క్రితం డాక్టర్ సూర్యకుమారి అర్ధరాత్రి వేళ తమ ఇంటికి వచ్చారనీ, కొద్దిసేపు ఆమె తన భర్తతో మాట్లాడిందని వెల్లడించారు. ఆ తర్వాత ఆమెని ఇంట్లో దించి వస్తానని చెప్పి తన భర్త తీసుకొని వెళ్ళారని చెప్పారు. ఐతే తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో తనకు తెలియడంలేదనీ, ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
 
తన భర్తకు వేరే యువతితో అక్రమ సంబంధం వున్నమాట నిజమేననీ, ఐతే ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. సదరు అమ్మాయి ఇష్టపూర్వకంగానే తన భర్తతో సంబంధం కొనసాగిస్తుందనీ, ఇందులో తన భర్త తప్పేమీ లేదనీ, ఆయనను అరెస్టు చేసేంత తప్పు ఏం చేశారంటూ ఆమె ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments