Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ సిద్ధార్థ్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (19:51 IST)
విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మరియు బి. సి.ఎ. చివరి సంవత్సరం విద్యార్థులు 16 మంది ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఉపాధి అవకాశం పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా ర‌మేష్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
 
మూడు దశలలో ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్. ఇంటర్వ్యూలలో తమ కళాశాల విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచి రెండున్నర లక్షల వార్షిక వేతనంతో ప్రోగ్రామర్ ట్రైనీలుగా ఉపాధి అవకాశం పొందినట్లు కళాశాల శిక్షణా ఉపాధి విభాగం అధికారి కావూరి శ్రీధర్ వెల్లడించారు. 
 
ఎంపికైన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ప్రొఫెసర్ రాజేష్ జంపాల, సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments