Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఓ కెమెడియన్.. ఆ డ్రామా కంపెనీకి డైరెక్టర్‌ ఆయనే..

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (13:57 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించిన నాటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాజకీయ కమెడియన్ పాత్రను చంద్రబాబు పోషించారని ఎద్దేవా చేశారు.
 
ప్రస్తుతం అదే పాత్రలో చంద్రబాబు మరో హాస్య గుళిక వదిలారంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను గెలిపించింది తానేనని చెప్తూ చంద్రబాబు ఓవరాక్షన్ చేస్తున్నారని.. మీడియా వుందనే విషయాన్ని బాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. అప్పట్లో తన దగ్గర నేర్చుకున్న ఎత్తుగడలతోనే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కూడా చంద్రబాబు ప్రచారం చేసుకుంటారేమో అని విజయసాయి ఎద్దేవా చేశారు. 
 
అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఫైర్ అయ్యారు. రాఫెల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇకనైనా చంద్రబాబుకు కనువిప్పుకలగాలని విమర్శించారు. రాఫెల్ పిటిషన్ల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ శుక్రవారం ఇచ్చిన తీర్పుపై కన్నా హర్షం వ్యక్తం చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా కంపెనీ అన్న ఆయన ఆ కంపెనీకి డైరెక్టర్‌ చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి పట్టించుకోవడానికి ప్రజలు సిద్దంగా లేరన్నారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ స్నేహం చేస్తే తెలంగాణలో చేతులు కాలినట్లు మళ్లీ కాల్చుకుంటారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments