Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు-బాబుపై సాయి ధ్వజం

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (16:05 IST)
ఎస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన వ్యవహారం‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. ఎస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేశాడని 1300 కోట్ల రూపాయల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బా రెడ్డి సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. 
 
ఎస్ బ్యాంకుకు ఏపీ టూరిజం శాఖ నిధులను కూడా చంద్రబాబు దోచిపెట్టాడని ఇలాంటి దోపిడీలు ఇంకెన్ని ఉన్నాయోనని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తన ఆరోపణలకు ఆధారంగా ఎస్ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ను కూడా ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు.
 
అలాగే స్థానిక ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లపై ప్రతాప రెడ్డితో బాబు కేసు వేయించి కొట్టేయించారని.. అంతేకాకుండా బీసీ నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెట్టారని విజయసాయి ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నికలు జరగకూడదనేదే బాబు దురుద్దేశమని చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments