గుంటూరు వెస్ట్ స్థానానికి నామినేషన్ వేస్తున్న విడుదల రజినీ కిడ్నాప్, పోలీసులు సెర్చింగ్

ఐవీఆర్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (15:18 IST)
ఏపీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికివారే పోటాపోటీగా రోడ్ షోలు, స్ట్రీట్ కాంపెయిన్లు చేస్తున్నారు. గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరు పక్షాల్లోనూ ఓటమి భయం వెంటాడుతోంది. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న బెంగ పట్టుకుని ఊపిరాడనీయడంలేదు. ఏ పార్టీ సభ ఏర్పాటు చేసినా ఆ పార్టీకి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. దీనితో వారు ఎవరికి గట్టిగా బుద్ధి చెబుతారో అర్థంకావడంలేదు. ఇదిలావుంటే ఏపీలోని గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది.
 
గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు విడుదల రజినీ అనే మహిళ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నది. ఐతే ఆ మహిళను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థిని ఎవరో కిడ్నాప్ చేసారన్న వార్తలు రావడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.

కాగా సదరు మహిళ పేరుతోనే వైసిపి ఎమ్మెల్యే విడదల రజినీ వుండటంతో టీడీపీయే బలవంతంగా నామినేషన్ వేయించేందుకు యత్నం చేసిందని వైసిపి అంటుంటే... వైసిపి నాయకులు స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసారంటూ తెదేపా నాయకులు అంటున్నారు. ఐతే పోలీసులు సదరు మహిళ జాడను కనుగొన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments