Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లి అంటూనే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చెరబట్టాడు : బాధితురాలు

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (11:47 IST)
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను చెల్లి చెల్లి అంటూనే చెరబట్టాడని బాధితురాలు ఆరోపించింది. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించారు. బాధితురాలు హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ, 'వైకాపా నుంచి వచ్చిన ఆదిమూలాన్ని గత ఎన్నికల్లో సత్యవేడు టీడీపీగా అభ్యర్థిగా ఖరారు చేశారు. నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న తాను ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. అయినా అధిష్ఠానం ఆయన్నే ఖరారు చేయడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ప్రచారం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆదిమూలం తన ఫోన్ నంబరు తీసుకున్నారు. 
 
ఎన్నికల్లో గెలిచాక పలుమార్లు ఫోన్ చేసి తిరుపతిలోని ఓ హోటల్‌కు రావాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో జూన్ 7వ తేదీ నేను వెళ్లాను. ఒంటరిగా ఉన్న ఆయన తనను బెదిరించి శారీరంకాగ లోబరుచుకున్నాడు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినందునే తనపై కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నా భర్త, పిల్లలను చంపేస్తానంటూ బెదిరించారు. తర్వాత మూడుసార్లు బలాత్కారం చేశారు. రాత్రి పగలూ తేడా లేకుండా పదేపదే ఫోన్ చేసేవారు. 
 
అర్థరాత్రిళ్లూ కాల్స్ వస్తుండటంతో తన భర్తకు అనుమానం వచ్చి, గట్టిగా నిలదీశాడు. ఎమ్మెల్యే బెదిరించి లొంగదీసుకున్న విషయాన్ని మా వారికి చెప్పా. ఇలా చాలామందిని ఆదిమూలం వేధిస్తున్నట్లు తన భర్త తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు పెన్ కెమెరాను సిద్ధం చేసి ఇచ్చారు. కోరిక తీర్చకపోతే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించడంతో, జులై 10న పెన్ కెమెరాతో ఆయన దగ్గరకు వెళ్లా. ఎమ్మెల్యే వేధింపులను రికార్డు చేశా. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడానికి, తెదేపాలో ఉండటానికి వీల్లేదని అన్ని ఆధారాలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని కోరాం. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది' అని వివరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం