Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డను బెదిరించలేదు : వెంకటరామిరెడ్డి వివరణ

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (17:01 IST)
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను బెదిరించినట్టు వచ్చిన వార్తలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమాఖ్య ఛైర్మన్ వెంకటరామిరెడ్డి వివరణ ఇచ్చారు. తాము ఎవరినీ బెదిరించేలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. 
 
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'కరోనాతో ఉద్యోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పాం. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలే కానీ.. నిమ్మగడ్డను ఉద్దేశించినవి కావు. నిమ్మగడ్డ కోరినట్లు నాపై పోలీసులు నిఘా పెట్టినా అభ్యంతరం లేదు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని చెప్పాం. 2 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే నష్టమేంటి?. ఉద్యోగుల కోసం ఎన్నికలు వాయిదా వేయలేరా?. పంచాయతీ ఎన్నికలు వద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు' అని చెప్పుకొచ్చారు. 
 
అంతకుముందు.. కరోనా ముప్పు ఇంకా కొనసాగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతానికి సాధ్యం కాదంటున్నా మొండిగా వ్యవహరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. 
 
ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సహా వివిధ ప్రభుత్వ, ఉపాధ్యాయ సంఘాల నేతలు శనివారం వేర్వేరుగా మాట్లాడుతూ నోటిఫికేషన్‌ విడుదలను తప్పుపట్టారు. ఉద్యోగుల ప్రాణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. 
 
ఎన్నికలకు ఇది సమయం కాదు.. ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ ఇచ్చాక ఎన్నికలు నిర్వహించాలని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు పోయినా పర్వాలేదు.. ఎన్నికలు మాత్రం జరపాలని అనుకోవడం ఏమిటని ఆక్రోశం వెలిబుచ్చారు. 
 
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లాలని కోరారు. తమ వినతిని పట్టించుకుని నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments