Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్... ఇది విన్నారా...? లడ్డూలు పాచిపోవచ్చు కానీ డబ్బులు పాచిపోవు... వెంకయ్య

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పరోక్షంగా చురకలు అంటించారు. ప్రత్యేక హోదాను కొందరు పాచిపోయిన లడ్డూలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కానీ లడ్డూలైతే పాచిపోవచ్చు... కానీ కేంద్రం ఇస్తుంది లడ్డూలు కాదు డబ్బులు. డబ్బులు పాచిపోవు అం

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (17:09 IST)
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పరోక్షంగా చురకలు అంటించారు. ప్రత్యేక హోదాను కొందరు పాచిపోయిన లడ్డూలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కానీ లడ్డూలైతే పాచిపోవచ్చు... కానీ కేంద్రం ఇస్తుంది లడ్డూలు కాదు డబ్బులు. డబ్బులు పాచిపోవు అంటూ చురకలు అంటించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడుతూ... విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడని వారు ఇప్పుడు ఏదో తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. 
 
ఆరోజు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసింది నేనే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లులో పెట్టాల్సింది. కానీ ఆ పని చేయకుండా తప్పించుకుంది. ఇప్పుడు కేంద్రం హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది. హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగే సౌకర్యాన్ని అందించింది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదాతో అయితే 90 శాతం నిధులు కేంద్రం భరించాల్సి ఉంటుంది. కానీ ప్రత్యేక ప్యాకేజీతో 100 శాతం నిధులను కేంద్రమే భరిస్తుంది. అదీ తేడా. ఈ తేడా తెలియని కొందరు ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అని ఏవేవో మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments