Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ బుల్లెట్ రైలులో పాము.. ఆగిన రైలు.. ఎవరిదైనా పాము తప్పిపోయిందా?

జపాన్ దేశంలో పాములను పెంపుడు జీవులుగా పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో పాములంటే జడుసుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉండరనే చెప్పాలి. కానీ ఓ పామును చూసి కొందరు ప్రయాణీకులు బుల్లెట్ రైలును ఆపేశారు. ఈ

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (16:18 IST)
జపాన్ దేశంలో పాములను పెంపుడు జీవులుగా పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో పాములంటే జడుసుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉండరనే చెప్పాలి. కానీ ఓ పామును చూసి కొందరు ప్రయాణీకులు  బుల్లెట్ రైలును ఆపేశారు. ఈ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టోక్యో నుంచి హిరోషిమా వెళ్తున్న షింకెన్‌స‌న్ బుల్లెట్ రైళ్లో పాము కనిపించింది. సీట్ల మ‌ధ్య ఉన్న ఆ స‌ర్పాన్ని ఓ ప్రయాణీకుడు చూశాడు. అంతే రైలును ఆపేశాడు. 
 
అయితే బుల్లెట్ రైలులోని ఆ పాము ద్వారా ప్రయాణీకులకు ఎలాంటి హానీ చేకూరలేదు. బ్రౌన్ స్నేక్ లేదా రాట్ స్నేక్ అని ఈ సర్పాన్ని పిలుస్తారు. ఇది 30 సెంటీమీట‌ర్ల పొడ‌వు ఉంది. అయితే అది విష స‌ర్పం కాద‌ని అధికారులు తెలిపారు. దీన్ని కొంద‌రు పెంపుడు జంతువుగా ట్రీట్ చేస్తారు. దాంతో రైలు సిబ్బంది రైళ్లోనే ఓ ప్ర‌ట‌క‌న చేశారు. ఎవ‌రిదైనా పాము త‌ప్పిపోయిందా అంటూ ప్ర‌క‌టించారు. 
 
కానీ ప్యాసింజెర్లు ఎవ‌రూ ఆ స‌ర్పాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఇంత జరిగి రైలు ఆగిపోయినా.. వాస్తవానికి క్రమశిక్షణకు మారుపేరైన జపాన్ రైలు మాత్రం నిర్దేశిత సమయానికి స్టేషన్‌కు చేరుకోవడం గమనార్హం.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments