Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య రాజకీయ వారసురాలిగా దీప... రాణిస్తారా?

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వెంకయ్యనాయుడు తన రాజకీయ వారసురాలిగా దీపను తీసుకురాబోతున్నారట. 40 యేళ్ళ పాటు రాజకీయాల్లో తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకుని చివరకు పార్టీ నుంచే బయటకు రావాల్సిన పరిస్థితి వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ద్వారా ఏర

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (17:47 IST)
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వెంకయ్యనాయుడు తన రాజకీయ వారసురాలిగా దీపను తీసుకురాబోతున్నారట. 40 యేళ్ళ పాటు రాజకీయాల్లో తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకుని చివరకు పార్టీ నుంచే బయటకు రావాల్సిన పరిస్థితి వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ద్వారా ఏర్పడింది. అయితే బిజెపితో తనకున్న అనుబంధాన్ని పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో కుమార్తె దీపను రంగంలోకి దింపనున్నారట. ఇప్పటికే దీపను వెంకయ్య ఒప్పించినట్లు తెలుస్తోంది. 
 
అందుకే గత వారంరోజుల నుంచి ఎపిలో పర్యటిస్తున్న వెంకయ్య కుమార్తెను దగ్గరుండి తీసుకెళుతున్నారట. దీపకు పార్టీలో మంచి పదవి ఇప్పించి ఆ తరువాత వచ్చే ఎన్నికల్లోపు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించనున్నారట వెంకయ్య. రాజకీయాల గురించి అస్సలు తెలియని దీప ఏ విధంగా బిజెపిలో ఇమడనుందో ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. స్వర్ణభారత్ ట్రస్టులో చురుగ్గా ఉన్న దీప కేవలం దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు కానీ ఎప్పుడు రాజకీయాల గురించి పట్టించుకోలేదు. అలాంటి దీప రాజకీయాల్లో ఎలా రాణిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments