Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసున్న నేత వంగవీటి రంగా: మంత్రి కొడాలి నాని

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (06:49 IST)
కార్మికులు కర్షకులు అనగారిన  పేద వర్గాల ప్రజల  అభ్యున్నతి  కొరకు పోరాడిన మంచి మనసున్న నేత వంగవీటి రంగా అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోదారుల వ్యవహారాలు శాఖ మంత్రి  కొడాలి నాని అన్నారు.

గుడ్లవల్లేరు మండలం గాదేపూడి గ్రామంలో దివంగత నేత వంగవీటి రంగా 32 వ వర్ధంతి సందర్భంగా  గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని మంత్రి కొడాలినాని, యంపి. బాలశౌరి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ  కార్మికులు కర్షకులు అనగారిన  పేద వర్గాల ప్రజల  అభ్యున్నతి కొరకు పోరాడిన మంచి మనసున్న నేత  వంగవీటి మెహన్ రంగా అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.   

అనంతరం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి మాట్లాడుతూ  వంగవీటి రంగా మరణించి 32 సంవత్సరాల అయినప్పటికీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ  గుర్తుంచుకున్నారన్నారు.

ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కార్పొరేటర్ సభ్యులుగా, శాసన సభ్యులుగా ప్రజలకు సేవాలందించారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments