అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఠాగూర్
ఆదివారం, 29 జూన్ 2025 (11:23 IST)
అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించింది. అప్పీల్ దాఖలకు అవసరమైన చర్యలు చేపట్టాలని అడ్వకేట్ ఆన్ రికార్డు కార్యాలయ ప్రత్యేక అధికారిని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
 
గత వైకాపా ప్రభుత్వ హయాంలో విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు కలిసి అక్రమ మైనింగ్‌కు పాల్పడటంతో ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శాఖ నిర్ధారించింది. దీనిపై జిల్లా మైనింగ్ అధికారి ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసుల మే 14వ తేదీన కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టు ఆశ్రయించగా, ఏ యేడాదిగ మే 29వ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ పిటిషన్‌పై విచారణ జరిపిన వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే, హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments