కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయిలో వాక్సినేషన్ ... రాత్రి 10 గంట‌ల స‌మ‌యానికి 1,40,583 మందికి టీకాలు

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (06:04 IST)
కరోనా కట్టడికి కృష్ణాజిల్లాలో ఆదివారం నిర్వహించిన కోవిడ్ టీకా మెగా డ్రైవ్‌లో భాగంగా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్ ఆదేశాలు మేరకు లక్ష మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంకాగా కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయిలో వాక్సినేషన్ ప్ర‌క్రియ కొన‌సాగింది.

మెగా వాక్సినేషన్‌ లో రాష్ట్రంలో 3వ స్థానం ద‌క్కించుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల స‌మ‌యానికి 1,40,583 మంది ప్ర‌జ‌లు కోవిడ్ టీకాలు వేయించుకున్నారు. రాత్రి 7గంట‌లు వరకు 1.36,010 టీకాలు వేయగా 8గంట‌లు గంటల సమయానికి 1,38,818కి, రాత్రి 9 గంటలకు 1,39,980కు చేరింది.

ఆదివారం నిర్వహించిన మెగా వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేయడానికి కృషి చేసిన  మెడికల్ ఆఫీసర్స్, వైద్య అధికారులు, నర్స్‌లు, ఏఎన్‌యం, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఆర్వో, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేసిన జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులను కలెక్టర్ అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments