Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణా జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతులు రద్దు

కృష్ణా జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతులు రద్దు
, సోమవారం, 7 జూన్ 2021 (12:48 IST)
కృష్ణా జిల్లాలో 82 హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీ వర్తింపు ఇవ్వడం జరిగిందని జెసి, జిల్లా కోవిడ్ నోడల్ అధికారి ఎల్.శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే 33 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ  కింద కోవిడ్ రోగులకు చికిత్స,రోగులు లేనందున  వాటికిచ్చిన అనుమతులు రద్దు చేసిన‌ట్లు తెలిపారు.

ఇందులో భాగంగా జూన్ 3వ తేదీన 20 ఆస్పత్రులకు, జూన్ 5వ తేదీన మరో 13 ప్రైవేట్ ఆస్పత్రులకు కోవిడ్ సేవల అనుమతులు రద్దు చేయడం జరిగిందన్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను గుర్తించి ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యం అందిoచేందుకు జిల్లా యంత్రాంగం పనిచేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద 6 వేల పడకలు, కోవిడ్ కేర్ సెంటర్లో 3 వేల పడకలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 
 
వైఎస్ఆర్  ఆరోగ్యశ్రీ లో పోస్టుల భర్తీ: జేసి ఎల్.శివశంకర్ 
కృష్ణా జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో ఉన్న 22 ఆరోగ్యమిత్ర, ఆరుగురు టీం లీడర్స్‌ను అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి), జిల్లా కోవిడ్ నోడల్ అధికారి ఎల్.శివశంకర్ ఒక ప్రకటనలో కోరారు.

అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9వ తేదీలోగా తమ రెస్యూమ్‌తో నకలు సర్టిఫికేట్స్ జతచేసి (డా.వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్, జిల్లా కో ఆర్డినేటర్,స్టేట్ గెస్ట్‌హౌస్ కాంపౌండ్, సూర్యారావుపేట, పిడబ్ల్యూడి గ్రౌండ్స్, విజయవాడ)  పంపించాలని, సంబంధిత వివరాలకై www.krishna. ap. gov.inలో చూడవచ్చ‌ని తెలిపారు. విజయవాడలో నిర్వహించే పరీక్షా, ఇంటర్వ్యూల వివరాలను అభ్యర్థులకు ఫోన్ ద్వారా ఎక్కడ హాజరు కావాలో తెలియజేస్తామ‌న్నారు. 
 
ఆరోగ్యశ్రీ లో ఇద్దరు సిబ్బంది తొలగింపు...
కృష్ణా జిల్లా ఆరోగ్యశ్రీ విభాగంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరిని తొలగించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (సంక్షేమం), జిల్లా కోవిడ్ నోడల్ అధికారి ఎల్.శివశంకర్ తెలిపారు. జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల్లో 80కి పైగా ఆస్పత్రుల్లో సుమారు 6 వేల పడకలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

వీటిలో ఆరోగ్యశ్రీ పేషెంట్స్‌కు సమర్ధవంతంగా సేవలు అందించేందుకు సిబ్బందిని నియమించామన్నారు. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా మేనేజ‌ర్ అంజాద్‌, టీం లీడ‌ర్ శ్యాంబాబును విధుల నుంచి తొలగించడం జరిగిందని ఆ ప్రకటనలో తెలిపారు.

వీరివురూ విధి నిర్వహణలో సమయ పాలన పాటించకపోవడం, ఆరోగ్యమిత్రలను, ప్రైవేట్ ఆస్పత్రులను సరైన విధంగా పర్యవేక్షణ చేయకపోవడం, సమర్ధవంతంగా విధులు నిర్వహించని కారణంగా వారిని తొలగించడం జరిగిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నారులకు కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకినపుడు..!