Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటికి సెలవు: విజయశాంతి

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:08 IST)
దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించి తనదైన నటనతో అలరించారు సీనియర్ నటి విజయశాంతి. సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో విజయశాంతి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా ఇటీవల సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ సినిమాలో విజయశాంతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఇకపై మరిన్ని సినిమాల్లో విజయశాంతి నటిస్తారని అందరూ అనుకున్నారు.

అయితే ఇప్పట్లో మరో సినిమాలో నటించే ఉద్దేశం విజయశాంతికి లేదు. ఆ మేరకు తన ట్విటర్ ఖాతాలో విజయశాంతి ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ``సరిలేరు మీకెవ్వరు`.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

`కళ్ళుకుల్ ఇరమ్`, `కిలాడి కృష్ణుడు` నుంచి నేటి `సరిలేరునీకెవ్వరు` వరకు నన్ను ఆదరించి గౌరవించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు -మీ విజయశాంతి` అంటూ విజయశాంతి వరుస ట్వీట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments