కేవలం 30 రూపాయలు అడిగిన భార్య-ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (13:00 IST)
ఆగస్టు ఒకటో తేదీ నుంచి ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి వచ్చింది. ట్రిపుల్ తలాక్ చెబితే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది. తలాక్‌ బిల్లు అమలులోకి వచ్చినా, ఆ పేరుతో మహిళలకు అన్యాయం చేసే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఏమాత్రం భయం లేకుండా భార్యలకు చిన్న చిన్న కారణాల వల్ల తలాఖ్ చెప్పేస్తున్నారు పురుషులు. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే? కేవలం రూ.30 కోసం ఓ మహిళకు తలాక్ చెప్పేశాడో భర్త. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాకు చెందిన మహిళకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, కొన్ని రోజుల కిందట ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో మందులు కొనుక్కొనేందుకు రూ.30 కావాలని భర్తను అడిగింది. కానీ తన వద్ద డబ్బులు అడిగిన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త.. ఆమెకు తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. 
 
అంతేకాదు.. తలాక్ చెప్పేశాను కదా.. ఇక నా ఇంట్లో ఉండేందుకు వీల్లేదని ఇంట్లోంచి మెడ పట్టి బయటలకు గెంటేశాడు. దీంతో, బాధితులను తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments