Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మంచోడు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నా : ఉప్పులేటి కల్పన

వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అధికార టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (11:48 IST)
వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అధికార టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకే తాను టీడీపీలోకి చేరుతున్నట్టు తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటే నిధుల కొరత ఉంటుందన్నారు. రాష్ట్రంలో పామర్రు నియోజకవర్గాన్ని తొలి స్థానంలో నిలపడమే తన ఆకాంక్షమని తెలిపారు. 
 
వైసీపీ పార్టీ విధానాలకు అనుగుణంగానే గతంలో టీడీపీపై విమర్శలు చేశానని... వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచే ఆలోచన తనకు లేదని చెప్పారు. తనతో పాటు 30 మంది సర్పంచ్‌లు, 20 మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మరి కొందరు నేతలు టీడీపీలో చేరుతారని చెప్పారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించినా... నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కాగా, ఈమె కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments