Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీఏ ఆఫీసును మసాజ్ కేంద్రంగా మార్చిన ఎంవీఐ... ఎక్కడ?

హైదరాబాద్‌లోని ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం మసాజ్ కేంద్రంగా మారిపోయింది. ఈ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసే సురేష్ రెడ్డి ఈ ఆఫీస్‌ను మసాజ్ కేంద్రంగా మార్చి.. కింద ఉద్యోగులతో మసాజ్ చేయిం

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (10:49 IST)
హైదరాబాద్‌లోని ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం మసాజ్ కేంద్రంగా మారిపోయింది. ఈ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసే సురేష్ రెడ్డి ఈ ఆఫీస్‌ను మసాజ్ కేంద్రంగా మార్చి.. కింద ఉద్యోగులతో మసాజ్ చేయించుకున్నాడు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఏం చేయాలో తెలియక.. ఆరోగ్యం బాగలేకనే అలా చేశానంటూ బుకాయిస్తున్నాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో ఎంవీఐగా సురేష్ రెడ్డి పని చేస్తున్నారు. ఈయన గారు ఇదే కార్యాలయంలో పని చేసే తోటమాలితో మసాజ్‌ చేయించుకోవడం విశేషం. కింది స్థాయి ఉద్యోగి అయిన శ్రీనివా్‌సతో మెడలు, భుజాలు పట్టించుకోవడమే ఒక తప్పు కాగా, ప్రభుత్వ కార్యాలయాన్ని తన ఇంటిలా భావిస్తూ మసాజ్‌ కేంద్రంలా మార్చడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. 
 
సిబ్బందితో మసాజ్‌ చేయించుకుంటుండగా గమనించిన మరికొందరు, ఇతర సిబ్బంది ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఎంతగా ఆరోగ్యం బాగాలేప్పటికీ కార్యాలయాన్ని ఏకంగా మసాజ్‌ కేంద్రంగా మార్చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సిబ్బంది కార్యాలయం పనులు చేయడానికా.. లేక ఉన్నతాధికారులకు మసాజ్‌లు చేయడానికా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 
 
దీనిపై సురేష్ స్పందిస్తూ, గత 20 ఏళ్లుగా స్పాండిలైటిస్ (మెడనొప్పి) సమస్య ఉంది. బాగా నొప్పి వచ్చినప్పుడు నిపుణుల వద్ద మసాజ్‌ చేయించుకుంటాను. అయితే రెండు రోజులుగా మెడనొప్పి బాగా పెరిగిపోయిందనీ ఈ కారణంగానే కార్యాలయం పనివేళలు ముగిశాకనే తోటమాలితో మసాజ్ చేయించుకున్నట్టు వివరణ ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments