Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (15:55 IST)
మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ చేతి వంటకు హీరో చెర్రీ సతీమణి, మెగా కోడలు, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కామినేని ముగ్ధురాలయ్యారు. ముఖ్యంగా తన అత్తగారు ఈ సీజన్‍లో పెట్టిన ఆవకాయ పచ్చిడి అద్భుతంగా ఉందని ఆమె కొనియాడారు. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
ఆహారం కేవలం పోషకాహారం అందించడమే కాదని, అది మన సంస్తృతిని, వారసత్వాన్ని పరీక్షించుకునే ఒక ముఖ్యమైన మార్గమని తన అత్తగారు సురేఖ భావిస్తారని ఉపాసన తెలిపారు. నా ప్రియమైన అత్తమ్మ సురేఖ గారు ఈ సీజన్‌ అవకాయ పచ్చడితో అదరగొట్టేశారు. ఆమె దృష్టిలో ఆహారం అంటే కేవలం పోషణ మాత్రమే కాదు... సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవడం కూడా అంటూ ఉపాసన తన అత్తగారిపై అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తంచేశారు. 
 
సురేఖ కొణిదెల అందించే రుచులకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అత్తమ్మాస్ కిచెన్ పేరిట ఒక వేదికను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, ఆసక్తి ఉన్నవారు సదరు వెబ్‌సైట్ ద్వారా అవకాయ పచ్చడిని ఆర్డర్ చేసుకోవచ్చని ఉపాపన సూచించారు. 
 
మెగా కోడలిగా, అపోలో హాస్పిటల్స్ బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తూనే, కుటుంబ సభ్యుల పట్ల ముఖ్యంగా అత్తగారి పట్ల ఉపాసన చూపిస్తున్న ఆప్యాయత, వారి ప్రతిభను ప్రోత్సహిస్తున్న తీరు పలువురిని అకట్టుకుంటోంది. సురేఖ గారి వంటకాలకు, ముఖ్యంగా ఆమె పెట్టే పచ్చళ్ళకు ఎంతో పేరుందని మెగా కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. ఇపుడు ఉపాసన ప్రశంసలతో ఆ విషయం మరోసారి రుజువైంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments