Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (17:20 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి నిధుల వరద పారించారు. ఆ తర్వాత ఏపీకి గుడ్డిలో మెల్లగా అన్నట్టుగా కొంతమేరకు నిధులు కేటాయించారు. ముఖ్యంగా, ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.5936 కోట్లను ఆమె కేటాయించారు. అలాగే, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూడా ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన కేటాయింపులను పరిశీలిస్తే, 
 
ఏపీకి కేటాయింపులు ఇవే :
పోలవరం ప్రాజెక్టుకు - రూ.5,936 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు బ్యాలెన్స్ గ్రాంట్ - రూ.12,157 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్‍‌‌కు - రూ.3,295 కోట్లు
విశాఖ పోర్ట్ కు - రూ.730 కోట్లు
రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు - రూ.186 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్‌కు - రూ.375 కోట్లు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి - రూ.162 కోట్లు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు - రూ.242.50 కోట్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

Sai Pallavi-అనారోగ్యానికి గురైన సాయి పల్లవి -రెండు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments