Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Advertiesment
rammohan naidu

ఠాగూర్

, శనివారం, 1 ఫిబ్రవరి 2025 (15:06 IST)
ఏపీలో అదనంగా మరో ఏడు విమానాశ్రయాలు రాబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఏపీ ప్రజల తరపున నిర్మలమ్మకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. 
 
ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనేది ప్రధాని ఆలోచనగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామన్నారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామని పేర్కొన్నారు. పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, వుడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని, ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అభిప్రాయపడ్డారు. 
 
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త  చెప్పారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయపన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. కొత్త పన్ను శ్లాబులను ప్రకటించారు. పన్ను చెల్లింపుల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అలాగే, మధ్యతరగతి ప్రజలు రూ.12 లక్షలకు వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదని తెలిపింది. 
 
అలాగే, కొత్తగా తీసుకొచ్చిన  పన్ను శ్లాబులు సవరణ
రూ.0-4 లక్షలు - సున్నా
రూ.4-8 లక్షలు - 5 శాతం 
రూ.8-12 లక్షలు - 10 శాతం
రూ.12-16 లక్షలు - 15 శాతం
రూ.16-20 లక్షలు - 20 శాతం
రూ.20-24 లక్షలు - 25 శాతం
రూ.24 లక్షల పైన 30 శాతం 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ: వాడు ప్రియుడా లేకుంటే మానవ మృగమా.. ప్రియురాలి మృతి.. ఏమైందంటే?