Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగ యువ‌త ఛ‌లో విజ‌య‌వాడ‌ ర‌ణ‌రంగం...

Webdunia
సోమవారం, 19 జులై 2021 (20:46 IST)
ఛలో విజయవాడ అంటూ, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువ‌త‌, వివిధ పార్టీల అనుబంధ సంఘాల వారు దండెత్త‌డంతో న‌గ‌రం ర‌ణ‌రంగంలా మారింది. యువ‌కులు పెద్ద పెట్టున సీఎం ఇంటికి బ‌య‌లుదేరుతున్నార‌ని, పోలీసులు వారిని ఎక్క‌డి క‌క్క‌డ అరెస్టులు చేశారు.

విజ‌య‌వాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వ‌ద్ద పోలీసులు, యువ‌కుల ప్ర‌తిఘ‌ట‌న‌తో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. వంద‌లాది మంది యువ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు అడిగితే అక్రమ అరెస్టులా...అని యువ‌కులు నిన‌దించారు. కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఛలో విజయవాడ కార్యక్రమానికి బయల్దేరిన పలు జిల్లాలు, మండల స్థాయి నాయకుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిలో కొంత మందిని గవర్నర్ పేట, నున్న, అజిత్ సింగ్ నగర్, వన్ టౌన్, సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ కి తరలించారు. అరెస్ట్ ఆయన వారిలో ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ నాయకులు ఓ.యేసుబాబు - (ఎస్ఎఫ్ఐ విజయవాడ), కోటి - (ఎస్ఎఫ్ఐ, విజయవాడ ), ప్రసన్న కుమార్ - (ఎస్ఎఫ్ఐ, రాష్ట్రఅధ్యక్షుడు కేంద్రం), వెంకటేశ్వరరావు - (ఎస్ఎఫ్ఐ విజయవాడ), 5.లెనిన్ - (ఎస్ఎఫ్ఐ విజయవాడ), రవి - (ఎస్ఎఫ్ఐ విజయనగరం), హర్ష - ఎస్ఎఫ్ఐ విజయనగరం, హరీష్, చినబాబు, వెంకటేష్ , సతీష్, అరవింద్, రాము, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, నెల్లూరు ఎస్.ఎఫ్. ఐ.కి చెందిన శ్రీనివాసులు, ఎస్.కె, సుల్తాన్ త‌దితరులు అరెస్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments