Webdunia - Bharat's app for daily news and videos

Install App

Uncle: కుమార్తెను వేధించాడు.. అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన మామ..

సెల్వి
సోమవారం, 2 జూన్ 2025 (12:09 IST)
కడపలో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. కుమార్తెను వేధిసున్నాడనే ఆగ్రహంతో అల్లుడిని మామ పొట్టనబెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కడన ఆర్కే నగర్‌కు చెందిన చాంద్ బాషాకు, అశోక్‌నగర్‌లో నివాసముంటున్న మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. 
 
అయితే వివాహం జరిగినప్పటి నుంచి ఆయేషాను చాంద్ బాషా వేధించాడు. ఈ వ్యవహారంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కుమార్తెను చాంద్ బాషా వేధింపులు కొనసాగుతూ వచ్చాయి.  
 
అంతేగాకుండా భార్యతో విభేదాల కారణంగా చాంద్ బాషా గత రెండు సంవత్సరాలుగా ఆమెకు దూరంగా ఆర్కే నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అల్లుడు చాంద్ బాషా తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని ఆయేషా తండ్రి మహబూబ్ బాషా ఆగ్రహంతో రగిలిపోయాడు. 
 
20 రోజుల క్రితం కువైట్ నుండి వచ్చిన ఆయేషా తండ్రి మహబూబ్ బాషా అల్లుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని కిడ్నాప్ చేసి చంపేశాడు. హత్య అనంతరం మహబూబ్ బాషాతో పాటు మరికొందరు చిన్నచౌకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments