రాపులపాలెంలో ఫైనాన్స్ వ్యాపారిపై అర్థరాత్రి కాల్పులు

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (08:54 IST)
కోనసీమ జిల్లా రావులపాలంలో అర్థరాత్రి కలకలం చెలరేగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వారిని వ్యాపారి కుమారుడు ప్రతిఘటించాడు. అయినప్పటికీ వారు కాల్పులు జరపడంతో బాధితులు పెద్దగా కేకలు వేశారు. దీంతో దండుగులు అక్కడ నుంచి పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రావులపాలెంలో సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి బడా ఫైనాన్స్ వ్యాపారిగా చెలామణి అవుతున్నాడు. ఈయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి కాల్పులకు తెగబడ్డారు. తొలుత ఆయనపై దుండగులు కాల్పులు జరుపగా, ఆ తర్వాత సత్యనారాయణ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి వారిని ప్రతిఘటించడంతో నిందితులు గాల్లోకి కాల్పులు జరిపారు. 
 
దీంతో సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో ఓ దండుగుడి చేతి సంచి కిందపడిపోయింది. దీన్ని పరిశీలించగా, అందులో రెండు నాటు బాంబులు, జామర్‌లు ఉన్నాయి. ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments