Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (19:55 IST)
విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్య పేట  సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అవ్వడంతో పాటు ఆటో డ్రైవర్ రాము, ఆటోలో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి సాయి ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఆటోలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని  స్థానికుల సహకారంతో గాయపడ్డవారిని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయిప్రదీప్ కోమటిపల్లి తాండ్రపాపారాయ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సీతానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments