Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నమయ్య జిల్లాలో ఇద్దరు చిన్నారులను మింగేసిన చెరువు

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (13:36 IST)
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా వీరబల్లి గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్ (9), కార్తీక్ (8) అనే ఇద్దరు చిన్నారులు గ్రామంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిద్దరూ తమ దస్తులను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత ఈత కొట్టేందుకు గట్టుపై నుంచి నీటిలో దూకారు. అంతే.. వారిద్దరూ వెళ్లి చెరువు ఊబిలో చిక్కుకునిపోయారు. 
 
అయితే, ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్ళిన పిల్లలు చీకటి పడినప్పటికీ ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో గాలించారు. చెరువు గట్టు వద్ద పిల్లల దుస్తులు కనిపించడంతో నీటిలో గాలించారు. ఈ గాలింపు చర్యల్లో ప్రవీణ్ మృతదేహం లభ్యంకాగా, కార్తీక్‌ను ఆస్పత్రికి తరలించే మార్గంలోనే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments