Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో తితిదే విజిలెన్స్ విభాగ అధికారి మృతి.. ముందు కరోనా ఆపై నెగెటివ్....

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:37 IST)
చెన్నైలో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తితిదే అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిజానికి ఈయన కరోనా వైరస్ బారినపడి ఆ తర్వాత కోలుకున్నారు. ఇంతలోనే ఆయన చనిపోవడం వైద్యులను కూడా ఆశ్చర్యానికి లోను చేసింది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అసిస్టెంట్ విజిలెన్స్-సెక్యూరిటీ అధికారిగా వి.మహేశ్వరరావు పని చేస్తున్నారు. ఈయనకు కరోనా వైరస్ లక్షణాలతో గత జూలై నెల 28వ తేదీన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు నుంచి ఈయన కొంత అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో రెండ్రోజుల కిందట నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ అని రావడంతో, ఆయన త్వరలోనే డిశ్చార్జి అయి, విధుల్లో చేరతారని టీటీడీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కానీ ఆలయ వర్గాల్లో విషాదం నింపుతూ ఆ అధికారి మృతి చెందారు. మహేశ్వరరావు మృతిపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చీఫ్ విజిలెన్స్-సెక్యూరిటీ ఆఫీసర్ జెట్టి గోపీనాథ్, ఇతర అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments