Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు తగు న్యాయం: సీపీఐ

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:25 IST)
నూతన పారిశ్రామిక విధానంలో సవరణలు చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు తగు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. గత ప్రభుత్వ  విధానాల కంటే తమ ప్రభుత్వం మరింత మెరుగైన పారిశ్రామిక విధానం తీసుకొస్తుందని భావించిన పారిశ్రామికవేత్తలకు నిరాశే మిగిలిందని వ్యాఖ్యానించారు. గత పారిశ్రామిక పాలసీకన్నా నూతన ఇండస్ట్రియల్ పాలసీలో పలు కోతలు విధించారని మండిపడ్డారు.

పెట్టుబడి, విద్యుత్, వడ్డీ రాయితీలను కుదించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రివర్స్ విధానాల వల్ల పారిశ్రామిక రంగాభివృద్ధి -2.2 శాతానికి పడిపోయిందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ విధానాలకు తోడు కరోనా మహమ్మారి వల్ల పలు రంగాలకు చెందిన లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా పారిశ్రామిక విధానంలో మార్పులు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

Ritu Varma: మజాకా లో రోమాన్స్ పెంచిన సందీప్ కిషన్, రీతు వర్మ

ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన హరర్, థ్రిలర్, లవ్ సినిమా గార్డ్

Dhanush: ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంతా కోపమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments