Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి తొక్కిసలాట- గాయపడిన వారికి శ్రీవారి వైకుంఠద్వార దర్శనం (video)

సెల్వి
శుక్రవారం, 10 జనవరి 2025 (13:10 IST)
Tirumala
తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం చేయించింది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీకి భక్తలు ధన్యవాదాలు తెలిపారు. 
 
సీఎం, టీటీడీ చైర్మన్ అదేశాల ప్రకారం మొత్తం 52 మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రకటన చేశారు. ప్రకటన చేసినట్లుగానే టీటీడీ ఛైర్మన్, అధికారులతో మాట్లాడారు.. ఈ మేరకు ఇవాళ వారందరికి దర్శనం కల్పించారు.
 
మరోవైపు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి అభిషేక సేవ అనంతరం వేకువజామున 3.45 గంటల నుంచే టీటీడీ అధికారులు దర్శనాలకు అనుమతించారు. వేకువజామునే అనుకున్న సమయం కంటే ముందే టీటీడీ ప్రొటోకాల్‌ ప్రముఖులకు దర్శనం కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments