Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

chandrababu naidu

ఠాగూర్

, గురువారం, 9 జనవరి 2025 (20:11 IST)
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తితిదే పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. 
 
'డీఎస్పీ రమణ కుమార్‌ బాధ్యత లేకుండా పనిచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్‌, గోశాల డైరెక్టర్‌ హరనాథ్‌ రెడ్డిని సస్పెండ్ చేశాం. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను తక్షణమే బదిలీ చేస్తున్నాం. ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తాం' అని తెలిపారు. 
 
'తితిదే ద్వారా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం. తిమ్మక్క, ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి రూ.5 లక్షల చొప్పున సాయం చేస్తాం. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనే సంకల్పం వారిలో ఉంది. 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాం' అని తెలిపారు. 
 
'తొక్కిసలాట ఘటన వార్త తెలిసి ఎంతో బాధపడ్డా. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటాను. ఘటనాస్థలిని పరిశీలించి.. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించా. తిరుమల దివ్యక్షేత్రం పవిత్రత కాపాడే బాధ్యత తీసుకుంటా. తెలిసీ తెలియక మనం చేసిన పనుల వల్ల దేవుడి పవిత్రత దెబ్బతినే పరిస్థితి వస్తే మంచిది కాదు. మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు రాకూడదు. ఇక్కడ రాజకీయాలు చేయడానికి వీల్లేదు. రాజకీయాలకు అతీతంగా కలియుగ దేవుడికి సేవ చేస్తున్నామనే భావనతో ముందుకుపోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలని హిందువులంతా కోరుకుంటారు' అని వ్యాఖ్యానించారు. 
 
తిరుమల కొండపై స్వామివారిని తలచుకుంటూ 36 గంటలైనా క్యూలైన్లలో దైవచింతనతో ఉంటాం. కానీ, తిరుపతిలో అంత సమయం వేచి ఉండటం ఇబ్బందిగా ఉందని భక్తులు చెబుతున్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం. వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజులకు పెంచారు. ఎందుకు పెంచారో తెలియదు. మొదటి నుంచి ఉన్న సంప్రదాయలను మార్చడం మంచిది కాదు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి. ఏ ఆలయంలోనూ అపచారం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పవిత్ర దినాల్లో దర్శనాలు సాఫీగా చేయించాల్సిన బాధ్యత అధికారులదే’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకు ముందు తితిదే పరిపాలనా భవనంలో.. తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, తితిదే జేఈవోతో

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు