Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

People are financially crippled

ఐవీఆర్

, గురువారం, 9 జనవరి 2025 (19:45 IST)
ఇదివరకు తాతలు, తండ్రులు వారికి సంబంధించిన స్నేహితులు, బంధువుల కుటుంబాలు అరకొర ఆర్థిక సమస్యలున్నా జీవితాన్ని మాత్రం హాయిగా సుఖసంతోషాలతో గడిపేసేవారు. కానీ ఇప్పుడలా కాదు. తాహతుకి మించిన కోర్కెలను తీర్చుకునేందుకు ఆర్భాటాలకు పోయి ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న కుటుంబాలు లెక్కలేనన్ని. గత 10 సంవత్సరాలలో ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితి దిగజారడానికి పది ప్రధాన కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము.
 
1. అవసరం లేకపోయినా కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్ ఉంటుంది.
 
2. సామాజిక ఒత్తిడిలో అవసరం లేకపోయినా సెలవులు పెట్టి టూర్లు.
 
3. హోదాకు చిహ్నంగా కారు- గాడ్జెట్‌లను కొనడం.(కనీసం నెలకి ఒక్కసారి కూడా కారు బైటకు తీయరు)
 
4. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినకుండా, వారాంతాల్లో అదేదో ఖచ్చితంగా బయటే తినాలని కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి వేలకు వేలు ఖరచు చేసేయడం.
 
5. సెలూన్‌లు, పార్లర్‌లు, దుస్తులు బ్రాండ్లవైతేనే మొగ్గుచూపడం. ప్రతి చిన్న అనారోగ్యానికి బాడీ హెల్త్ చెకప్ అంటూ వైద్య ఖర్చులను పెంచుతున్న చెడిపోయిన జీవనశైలి.
 
6. అందరూ కలిసి హాయిగా సమయం గడపడం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ద్వారా పుట్టినరోజు, వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నించడం.
 
7. అప్పులు చేసైనా అత్యంత గ్రాండ్ వివాహాలు, కుటుంబ కార్యక్రమాలు నిర్వహించడం.
 
8. ఆసుపత్రులు, పాఠశాలలు మరియు ట్యూషన్‌ల వాణిజ్యీకరణ.. విద్య... మొదలైనవి.
 
9. కొనలేని... అంటే తాహతుకి మించిన వాటిని కొనేందుకు ఎక్కువ వడ్డీకి రుణాలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు చేయడం.
 
10. ఇల్లు- ఆఫీసు లోపలి అలంకరణల కోసం లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేయడం, తద్వారా నిర్వహణ ఖర్చును పెంచడం.
 
పై పది పాయింట్ల ద్వారా మనకి తెలిసేది ఏమిటంటే... మన స్వంత అవసరాలు, ఆదాయాన్ని అర్థం చేసుకోకుండా ఇతరుల జీవనశైలిని చూసి కాపీ చేసుకోవడం. ఇది తగ్గించకపోతే, సంవత్సరాలు గడిచేకొద్దీ చాలా ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. ఆ తర్వాత దాని ఫలితం ఎలాంటి విపరీతానికైనా దారి తీయవచ్చు. ఆస్తులు పోవచ్చు. సంపాదించే ప్రతి పైసా అప్పులకే హారతి కర్పూరం కావచ్చు. కనుక మన ఆదాయం ఎంత, మనం ఖర్చు చేస్తున్నదెంత అనేది బేరీజు వేసుకుంటూ వెళ్తే జీవితం సంతోషాల నదిపై పూలనావలా సాగిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్