Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరిగిన పట్టుచీర.. ఆర్టీసీకి అపరాధం.. ఎందుకని?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (09:50 IST)
ఓ మహిళ కట్టుకున్న పట్టుచీర చిరిగితే ఆర్టీసీ సంస్థకు అపరాధం విధించారు. పట్టుచీర చిరగడానికి.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థకి సంబంధమేంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనాన్ని చదవండి. 
 
నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన నరసింహా రావు, వాణిశ్రీ అనే దంపతులు హైదరాబాద్‌లో ఉండే తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 2018 ఆగస్టు 26వ తేదీన నల్గొండ డిపోలో సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్నారు. 
 
ఈ దంపతులు అనుకున్న సమయానికి బస్టాండుకు వచ్చి... బస్సు ఎక్కుతుండగా, బస్సు డోర్ దగ్గర పైకిలేచివున్న రేకు తగిలి వాణిశ్రీ కట్టుకున్న పట్టుచీర చిరిగిపోయింది. ఆ తర్వాత ఎక్కిన మరో మహిళ చీర కూడా చిరిగిపోయింది. 
 
దీంతో ఆ రేకును సరిచేయాలని డ్రైవర్‌, కండర్లకు చెప్పగా, అది డిపో సిబ్బంది పని అంటూ దురుసుగా సమాధానమిచ్చారు. ఆ తర్వాత డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో వాణిశ్రీ దంపతులు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. టికెట్, బస్సు, బయటకు తేలిన రేకు, చిరిగిన చీర ఫొటోలను సాక్ష్యంగా సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన ఫోరం.. ఆర్టీసీ లోపాలను నిర్ధారించి… పట్టుచీరకు 2 వేలు, ఇతర ఖర్చులకు మరో వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments