Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతులేని ప్రేమకథ : భర్తను వదిలేసి పెళ్లైన మూడోరోజే ప్రియుడితో పారిపోయిన వధువు

ఇదే అంతులేని ప్రేమకథ. తిరుపతి పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన షాహినా, సోమశేఖర్‌లు ఏడాదిగా ప్రేమించుకున్నారు. సోమశేఖర్ పెళ్లికి న

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (16:17 IST)
ఇదే అంతులేని ప్రేమకథ. తిరుపతి పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన షాహినా, సోమశేఖర్‌లు ఏడాదిగా ప్రేమించుకున్నారు. సోమశేఖర్ పెళ్లికి నిరాకరించడంతో షాహినాకు ఆమె తల్లి మరొకరితో వివాహం జరిపించింది. పెళ్లైన మూడో రోజే తల్లి వద్దకు వచ్చిన షాహినాతో ప్రియుడు సోమశేఖర్ మళ్లి మాటలు కలిపాడు. నీతోనే జీవితం అంటూ ఆమెను విజయవాడ తీసుకెళ్లి కాపురం పెట్టాడు. 
 
40 రోజుల తర్వాత బంధువుల ఒత్తిడికి తలొగ్గి... షాహినాతో కలసి రేణిగుంట బుగ్గవీదిలోని ఇంటికి ఇద్దరూ వెళ్లారు. యువకుడిని ఇంట్లోకి రానిచ్చిన పెద్దలు షాహినాను గెంటేశారు. షాహినా తల్లి కూడా యవతిని ఇంట్లోకి రానీయలేదు. అర్థరాత్రి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రియుడు సోమశేఖర్ ఇంటి ముందు రోదిస్తూ న్యాయం చేయాలని ప్రాధేయపడుతోంది.
 
నిజానికి ఈ కేసులో ఆ యువతి పెళ్లికి ముందే వేరొకరిని ప్రేమించింది. ప్రియుడి తిరస్కారంతో మరొకరిని పెళ్లాడింది. పెళ్లైన తర్వాత మూడురోజులకు ప్రియుడు మళ్లీ కలిశాడు. నువ్వు లేకపోతే పిచ్చోడినవుతానన్న మాటలు నమ్మి మోసపోయింది. ఇపుడు నడి రోడ్డులో నిలబడింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments