Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్ @ హోమ్ పేరిట స్నాప్ డీల్ కొత్త సౌకర్యం: రోజుకు రూ.2వేలు పొందొచ్చు..

క్యాష్ అట్ హోమ్ పేరుతో స్నాప్ డీల్ నోట్ల కష్టాలతో బాధపడుతున్న వారికి కొత్త సౌకర్యాన్ని కల్పించింది. ఇందులో భాగంగా రూ.2000 నగదును స్నాప్‌డీల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌకర

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (16:03 IST)
క్యాష్ అట్ హోమ్ పేరుతో స్నాప్ డీల్ నోట్ల కష్టాలతో బాధపడుతున్న వారికి కొత్త సౌకర్యాన్ని కల్పించింది. ఇందులో భాగంగా రూ.2000 నగదును స్నాప్‌డీల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మొబైల్‌ యాప్‌ ద్వారా నగదు కావాలని రిక్వెస్ట్‌ పెట్టిన వెంటనే మీరు ఉన్న ప్రాంతంలో నగదు అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకుంటుంది. 
 
అనంతరం కంపెనీ పుష్‌ నోటిఫికేషన్‌ని పంపుతుంది. నోటిఫికేషన్‌ వచ్చిన అనంతరం ఆర్డర్‌పేజ్‌కి వెళ్లి నగదు కావాలని ఆర్డర్‌ చేయాలి. ఆర్డర్‌ చేసిన మరుసటి రోజు స్నాప్‌డీల్‌ లాజిస్టిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ మీ వద్దకి ఒక స్వైపింగ్‌ మిషన్‌తో వస్తాడు. దీంతో మీ వద్ద ఉన్న కార్డును స్వైప్‌ చేసి అతని వద్ద నుంచి రూ.2000 నగదును స్వీకరించవచ్చు. 
 
అయితే ఇందుకు రూ.1 ఫ్రీ రీచార్జ్ నుంచి లేదా మీ డెబిట్ కార్డు నుంచి కన్వీనియన్స్‌ ఫీజు కట్టాల్సి ఉంటుందని.. ఒక రోజుకి రూ.2000 మాత్రమే తీసుకోవాలని పేర్కొంది. ఈ వెసులుబాటు ప్రస్తుతానికి గుడ్‌గాం, ముంబయి, బెంగళూరులోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments