Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలేం జరిగిందంటే? అక్టోబర్ 1 విడుదల!

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:57 IST)
అసలేం జ‌రిగిందంటే చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అలరించనుంది. "పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి" తదితర సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, మొన్న వచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతికి చిన్నప్పటి కారెక్టర్ తో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఇందులో కథానాయకుడు. శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లు.  'రమణా లోడెత్తాలిరా' ఫేమ్ కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి, దొరబాబు ముఖ్య పాత్రలలో రూపొందిన ఈ సినిమా కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుంద‌ని అని చిత్ర రచయిత, దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియజేసారు.  అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని తెలియజేసారు. 
 
జి.ఎస్.ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏ.బి.ఆర్.ప్రొడక్షన్స్ ద్వారా అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్నారు. ఎమ్.జి.ఎమ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని, సాహిత్యం-సంగీతం: చరణ్ అర్జున్, కూర్పు: జె.ప్రతాప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, సమర్పణ: అనిల్ బొద్దిరెడ్డి, నిర్మాణం: జి.ఎస్.ఫిల్మ్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ బండారి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments