Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ దేవాదాయ శాఖకు టీటీడీ డబ్బు తరలింపు

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:10 IST)
ఏపీ దేవాదాయ శాఖకు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఏటా రూ.50 కోట్లు ఏకమొత్తం కింద చెల్లించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

అందులో నుంచి దేవాదాయ శాఖ పరిధిలోని సర్వ శ్రేయో నిధి(సీజీఎఫ్‌)కి రూ.40 కోట్లు, అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి(ఏడబ్ల్యూఎఫ్‌)కి రూ.5 కోట్లు, దేవాదాయ పరిపాలక నిధి(ఈఏఎఫ్‌)కి రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తారు.
 
ఇప్పటివరకు 1987 దేవాదాయశాఖ చట్టం ప్రకారం తితిదే సీజీఎఫ్‌కు ఏటా రూ.1.25 కోట్లు, ఏడబ్ల్యూఎఫ్‌, ఈఏఎఫ్‌లకు చెరో రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.2.25 కోట్లు చెల్లిస్తోంది. 
 
రాష్ట్రంలో జాయింట్‌ కమిషనర్‌ కేడర్‌ కలిగిన ఇతర దేవాలయాలు తితిదే కంటే ఎక్కువ మొత్తాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
శ్రీశైలం దేవస్థానం ఏటా రూ.30 కోట్లు చెల్లిస్తోంది. తితిదే ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. నలుగురు అధికారిక సభ్యులతో ధార్మిక పరిషత్‌ విధులు నిర్వహించేలా మరో ఆర్డినెన్స్‌ జారీ జారీ చేసింది.
 
 నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్‌లో నలుగురు అధికారిక సభ్యులు, వివిధ రంగాలకు చెందిన 17 మంది అనధికార సభ్యులు ఉంటారు.
 
 ప్రస్తుతం పూర్తిస్థాయిలో ధార్మిక పరిషత్‌ లేకపోవడంతో... అది నిర్వహించాల్సిన విధులకు అడ్డంకులు లేకుండా నలుగురు అధికార సభ్యులతో ఏర్పాటు చేసేలా  ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments