Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో లొట్టలేసుకుని తినే భోజనం, ఏమి రుచి?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:14 IST)
గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌తో వండిన సంప్ర‌దాయ భోజ‌నాన్ని శుక్ర‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స్వీక‌రించారు. తిరుమ‌ల అన్న‌మయ్య భ‌వ‌నం క్యాంటీన్‌లో టిటిడి గురువారం నుండి వారం రోజుల పాటు సంప్ర‌దాయ భోజ‌నాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్న విష‌యం విదిత‌మే.
 
ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ దాత‌ల స‌హకారంతో తిరుమ‌లలో సంప్ర‌దాయ భోజ‌నాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తులతో త‌యారుచేసిన ఆహారాన్ని భుజించ‌డం వ‌ల్ల వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని, క‌రోనా స‌మ‌యంలో శాస్త్రవేత్త‌లు కూడా ఇలాంటి ఆహారంపై చ‌ర్చిస్తున్నార‌ని తెలిపారు. 
 
ప‌ట్ట‌ణ‌వాసుల‌తో పోల్చుకుంటే గ్రామాల్లో స‌హ‌జసిద్ధంగా ల‌భించే ఆహారం తీసుకునే వారికి వ్యాధినిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌ని, ఈ సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపడం, గో ఆధారిత వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా గోమాత‌ను ర‌క్షించుకోవ‌డం టిటిడి ముఖ్య ఉద్దేశాల‌ని తెలిపారు. లాభాపేక్ష లేకుండా సంప్ర‌దాయ భోజ‌నాన్ని భ‌క్తుల‌కు అందిస్తామ‌ని, ముడిప‌దార్థాల‌న్నీ సిద్ధం చేసుకుని శాశ్వ‌త ప్రాతిప‌దికన దీన్ని అమ‌లుచేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని ఈవో వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments