నేడు ఒంగోలుకు టీడీపీ అధినేత చంద్రబాబు - ఘన స్వాగతానికి ఏర్పాట్లు

Webdunia
గురువారం, 26 మే 2022 (09:19 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఒంగోలుకు చేరుకోనున్నారు. ఒంగోలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మహానాడు ప్రారంభమయ్యే శుక్రవారం ఒంగోలుకు వస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన ఒక్క రోజు ముందుగానే ఒంగోలుకు చేరుకుంటున్నారు. 
 
ఇదిలావుంటే, మహానాడు జరిగే ప్రాంగణం అయిన మండవవారిపాలె పొలాల్లో వారం రోజులుగా ముమ్మంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. దాదాపు మహానాడు ఏర్పాట్లు ఓ కొలిక్కిరాగా ఒంగోలు నగరంలోని ప్రధాన కూడళ్ళు, రహదారులు, పాత బైపాస్ రోడ్డు ప్రాంతాలు టీడీపీ తోరణాలు, జెండాలు, నేతల ఫ్లెక్సీలు, హోర్డింగులతో నిండిపోయాయి. 
 
అలాగే, మహానాడు ప్రాంగణంలో ప్రతినిధుల సభ, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తుండగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం ఒంగోలు చేరుకున్నారు. రాష్ట్ర, జిల్లా నేతలతో కలిసి మహానాడు ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal sar: కథను ఎలా చెప్పాలి, ప్రజలకి చేరువ చేయాలి అనే దానికి కమల్ సార్ స్ఫూర్తి

Yash: సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో య‌ష్.. టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌లో క‌నిపిస్తున్నాడు

Karti: అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది : హీరో కార్తి

త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments