Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో వింత ఘటన: భూమి నుంచి పైకి వచ్చిన..?

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (19:03 IST)
తిరుపతిలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ భారీవర్షాల నేపథ్యంలో తిరుపతిలో వింత ఘటన జరిగింది. 
 
తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో భూమి నుంచి సిమెంట్ రింగుల ట్యాంక్ పైకి వచ్చింది. సిమెంటు రింగులతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
25 రింగుల్లో 18 సిమెంటు రింగులు భూమిపైకి వచ్చాయి. ఈ ఘటనలో స్పల్ప గాయాలతో ఓ మహిళ బయటపడింది. అలా పైకి వచ్చిన రింగులను చూసి స్టానికులు అవాక్కయ్యారు. 
 
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. దీంతో పలువురు నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షాలతో పెన్నా, స్వర్ణముఖి నదులు ఉప్పొంగాయి. 
 
పెన్నా నది ఉప నదులకు కూడా తీవ్రమైన వరదలు వచ్చాయి. పలు నీటి ప్రాజెక్టులు, చెరువుల ఆనకట్టలు తెగిపోవడంతో జనావసాల్లోకి వరదనీరు చొచ్చుకు వచ్చి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments